Foundation | కోక బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం…

Foundation | కోక బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం…

Foundation | మోత్కూరు, ఆంధ్ర‌ప్ర‌భ : తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదారి కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా ఈ రోజు మోత్కూరు మున్సిపల్ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన కోక బి.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ కోక బిక్షం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయానికి వస్తున్న భక్తులకు తమ ఫౌండేషన్(Foundation) ఆధ్వర్యంలో 100 మందికి భోజనం ప్యాకెట్లు అందించినట్లు ఆ ఫౌండేషన్ చైర్మన్ కోక బిక్షం తెలిపారు.

గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హాయంలో నిరుపేదలకు ఎంతోమంది అండగా నిలిచిన కిషోర్ కుమార్ సేవలు నేటికీ తుంగతుర్తి ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కిషోర్ కుమార్(Kishore Kumar) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు చెర్వుగట్టులో అన్న ప్రసాదం చేశారు. బిక్షం నుంచి భోజనం ప్యాకెట్లు అందుకున్న భక్తులు మళ్ళీ బి.ఆర్.ఎస్. రావాలని గాదరి కిషోర్ కుమార్ ఎమ్మెల్యేగా కావాలని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి( Sri Jadala Ramalingeswara Swamy) ఆశీస్సులతో కోరుకున్నట్లు బిక్షం చెప్పారు. అన్నం ప్యాకెట్లు అందుకున్నభక్తులు కిషోర్ కుమార్ ను నిండా నూరేళ్లుగా సుఖ సంతోషాలలో ఉండాలని ఆశీర్వదించినట్లు బిక్షం తెలిపారు.

Leave a Reply