Former | అన్నదాతల ఆవేదన..

Former | అన్నదాతల ఆవేదన..
Former, ఊట్కూర్, ఆంధ్రప్రభ : చేతికొచ్చిన పంటలు, పశువులు నాశనం చేస్తున్నాయని తమ పంటలను కాపాడాలని కోరుతూ నారాయణపేట జిల్లా ఊట్కూర్, దంతాన్ పల్లి రైతులు, బుధవారం పోలీసులు, (Police) పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కంది, మిరప, ఉల్లిగడ్డ పంటలను పశువులు నష్టం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు వివిధ పంటలు సాగు చేయగా పశువుల పెంపకందారులు రాత్రి, పగలు తేడా లేకుండా పశువులను వదిలివేయడంతో పంటలు నష్టం చేస్తున్నాయి అన్నారు. పశువులను బంధించి న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు. గత కొన్నేళ్లుగా తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పంటను పశువులు దెబ్బతీస్తున్నాయని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమ పంటలు కాపాడాలని కోరుతున్నారు.
