TG | కేసీఆర్ జన్మదినం… వృక్షార్చనకు మాజీ ఎంపీ సంతోష్ పిలుపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్ డే కు.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం జరుగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈరోజు నందినగర్ నివాసంలో వృక్షార్చన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేశారు కేటీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం చేయనున్నారు గ్రీన్ ఇండియా ఛాలంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సంతోష్ పిలుపునిచ్చారు.