ఏకలవ్య పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం బూర్గంపహాడ్ ,అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ట్రైకార్ చైర్మన్ ,బిఆరెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పట్వారిగూడెం వైద్యాధికారి డాక్టర్ దివాకర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆర్సీవో రత్న కుమారి, ప్రిన్సిపాల్ సంజయ్ మలకార్ ను ఫుడ్ పాయిజన్ లో కారణాలను అడిగి తెలుసుకున్నారు.
స్టోర్ రూమ్ ను పరిశీలించి అక్కడ వున్న ఆహారపదార్థాలను, కూరగాయలను, వంట నూనెలను, పప్పులను పరిశీలించారు. వంటగది, డైనింగ్ హాల్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. వంట సిబ్బందితో తాటి మాట్లాడుతూ.. ఇంట్లో తమ పిల్లలకు ఏ విధంగా వండి పెడుతున్నారో ఇక్కడ విద్యార్థులను కూడా స్వంత కుటుంబంలా భావించి శుభ్రంగా ఆహార పదార్థాలను వండి పెట్టాలని వంట సిబ్బందికి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం ఐతే సహించేది లేదని హెచ్చరించారు.
