మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం
గన్నేరువరం, (ఆంధ్రప్రభ) : మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ దళిత నాయకులు ఆల్వాల కోటి మాతంగి అనిల్ మాట్లాడుతూ… ప్రజా అభిమానంతో గెలిచి ప్రజా సేవ చేస్తున్న డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను, ఆయన తల్లిని నీచంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన నియోజకవర్గంలో ఎక్కడ తిరుగనియమని హెచ్చరించారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యే పదవిలో ఉండి తన స్థాయిని మరచిపోయి మాదిగ జాతి తలదించుకునే విధంగా రసమయి బాలకిషన్ ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూసుకు ఉపేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త మాజీ కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మేర రవీందర్ రెడ్డి, బొడ్డు సునీల్, చింతల శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వోడ్నాల నరసయ్య, నాయకులు బద్దం సంపత్ రెడ్డి, దుడ్డు మల్లేశం, ముసుకు కరుణాకర్ రెడ్డి, కయ్యం సంపత్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.