Former MLA | కాంగ్రెస్ హామీలన్నీ ఉత్తవే..

Former MLA | ఆలేరు మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునిత… ఆంధ్రప్రభకిచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు…రాష్ట్ర ఆర్థిక పరిస్థితిగురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిత్యం విచారణల పేరుతో ఎందరో బీఆరెస్ నాయకులు వేధింపులకు గురవుతూ…జైళ్ళపాలవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వెంటనే ఎందుకు ఇలా విచారణల పేరుతో వేధింపులకు వెంట పడాల్సి వస్తుంది.

ఒకవైపు కాళేశ్వరం స్కామ్ అని.. కార్ రేసింగ్ అని ఒక వైపు లేకపోతే పోన్ ట్యాపింగ్ కేసు అని ఒకవైపు.. విటన్నీంటి విచారణల కోసం కోర్టుల చుట్టు తిరుగుతున్నారు బీఆరెస్ పార్టీ నేతలు. బీఆరెస్ పాలనలో ప్రగతి పథంలో పయనిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పాలన వల్ల తిరిగి తిరోగరంలోకి పోతుదంనే బాధ తనకి ఉందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునిత ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కూడా కాంగ్రెస్ కి ఓటేసి తాము తప్పు చేశారనే భావన కనిపిస్తోందని గొంగిడి సునీత అన్నారు. ప్రస్తుతం స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఏర్పడీందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకి ఇవ్వాల్సీన నిధులు గాని.. ఆటు మండల పరిషత్, జిల్లా పరిషత్ మున్సిపాలిటీలకు ఇవ్వాల్సిన నిధులు గాని.. జీత,భత్యాలు, పెన్షన్లు ఏవయినా సరే… వీటన్నింటిని దారి మళ్ళించి వేరే వాటికి వినియోగించుకుంటున్నారు. అని అన్నారు..కాంటాక్టర్లకు బిల్లులు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారని అన్నారు సునీత.. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన సునీతతో ఆంధ్రప్రభ జరిపిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ..

పూర్తి విశేషాలను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

Leave a Reply