KTR | భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ సర్కార్…

KTR | భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ సర్కార్…

KTR | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎక్కడ భూములున్నా రేవంత్ ముఠా వాలిపోతుందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం హైదరాబాద్ లో జరిగిందన్నారు. 9,300 ఎకరాల భూమిని తమవారికి రేవంత్ సర్కార్ కట్టబెట్టిందన్నారు. బాలానగర్ (Balanagar) పరిసరాల్లో భూ కుంభకోణం జరిగిందని, ఎకరానికి రూ.40కోట్లు వేసుకున్నా.. రూ.4లక్షల కోట్ల భూకుంభకోణం జరిగిందన్నారు. ఎంతో విలువైన భూములపై రేవంత్ (Revanth) కుటుంబ సభ్యుల కన్నుపడిందన్నారు. ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply