world cup final| ఆ సత్తా వారికుంది..

world cup final| ఆ సత్తా వారికుంది..
కప్ కివీస్ గెలుస్తుందని వెల్లడి
అహ్మదాబాద్ పిచ్ పేస్‌కు అనుకూలం
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్.. వీలున్నప్పుడెల్లా టీమిండియాపై తన అక్కసు వెళ్లగక్కుతుంటాడు. ఎక్కడ మ్యాచులు జరిగినా భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటాడు. భారత జట్టు, ఆటగాళ్ల గురించి చాలా చీప్‌గా మాట్లాడుతుంటాడు. ఇవాళ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. టీమిండియాకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
భారత్ హాట్ ఫేవరేట్ అయినప్పటికీ.. ఆ జట్టు నుంచి ఓడించే సత్తా న్యూజిలాండ్‌కు ఉందని, అందుకు కారణం అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరగనుండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ తాము సెమీఫైనల్లో ఆడిన విధానాన్ని భారత్ దృష్టిలో ఉంచుకోవాలి. గతంలో అహ్మదాబాద్‌లోనే భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిందనే విషయాన్ని వారి మనసులో ఉంటుంది. ఆ రోజు ప్యాట్ కమిన్స్ స్టేడియంలోని ప్రేక్షకులను ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంచాడో.. మిచెల్ సాంట్నర్ కూడా అదే పని చేస్తాడని తెలిపాడు. భారత్‌ను ఓడించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు న్యూజిలాండ్ వద్ద ఉన్నాయి.
