ముస్లీంలు సుఖ సంతోషాలతో రంజాన్ జరుపుకోవాలి

ముస్లీంలు సుఖ సంతోషాలతో రంజాన్ జరుపుకోవాలి
- మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; ముస్లీంలు సుఖ సంతోషాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఐబీ విశ్రాంత భవన్ లో రంజాన్ తోపా పంపిణీలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లీం కుటుంబాలకు ప్రతి ఏటా రంజాన్ తోఫాను అందిస్తున్నామన్నారు.

ప్రతి ముస్లీమ్ కుటుంబం పండుగ వేళ ఆనందంతో ఉండేలా అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా తోఫా పంపిణీని ఆపలేదని గుర్తు చేశారు. లక్షేట్టిపేటలో మొత్తం 823 మందికి చీరలు, 5 కిలోల బియ్యం, డ్రై ఫ్రూట్స్ తో కూడిన కిట్ ను అందిస్తునట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలోని అన్ని మతాలను సమానంగా ఆదరించేది కాంగ్రెస్ అని వివరించారు. రాబోయే రోజుల్లో లక్షేట్టిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి – నర్సయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిరంతరం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలో లక్షేట్టిపేటలో ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతాయని, ప్రజలు ఎమ్మెల్యేకు అండగా ఉండాలని కోరారు.అభివృద్ధి లో మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. అనంతరం పలువురు ముస్లీమ్ లకు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఆరీఫ్,రమేష్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు శనిగారపు చిన్నయ్య,తోట సువర్ణ,రాజేంద్ర ప్రసాద్, పెండెం పద్మ రాజు,సూరం చంద్రమౌళి, పర్వీన్ సుల్తానా, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత రమేష్, నాయకులు నాగభూషణం, చింత అశోక్, ముక్రమ్ జా, సర్పంచ్ నల్లపు రజిత పోషమల్లు, సందెల సురేష్, నలిమేల రాజు, దుమ్మని సత్యన్న, శాతరాసి బానేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
