నివాళులర్పించిన మాజీ కౌన్సిలర్..

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన యాట నాగమణి పార్థివ దేహాన్ని పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో మల్లారెడ్డిపల్లి కాలనీకి చెందిన యాట నాగమణి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ నాగమణి పార్థివదేవాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. నాగమణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ కౌన్సిలర్ వెంట బిఆర్ఎస్ 17వ వార్డు అధ్యక్షులు చట్ల వెంకటేశ్వర్లు, వార్డు నాయకులు మహమ్మద్ అల్తాఫ్, రాయబారపు అనిల్, రంజిత్ కుమార్, యేసు, సాహిని, బండారి కోమల, జరీనా వార్డు ప్రజలు పాల్గొన్నారు.
