Forest | అన్నీ అటవీ బీట్లలో పులుల గణన ఆరంభం

Forest | అన్నీ అటవీ బీట్లలో పులుల గణన ఆరంభం

  • ఎఫ్డీఓ రామ్మోహన్

Forest | జన్నారం, ఆంధ్రప్రభ : అటవీ బీట్లలో పగడ్బందీగా పులుల గణన ప్రారంభమైందని మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం ఎఫ్డీఓ ఎం. రామ్మోహన్ అన్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన మాట్లాడుతూ… అఖిలభారత పులుల గణన-2026 కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి 25 వరకు పగడ్బందీగా నిర్వహించనున్నామన్నారు.

జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని జన్నారం, తాళ్లపేట, ఇందనపల్లి రేంజులలోని 40 అటవీ బీట్లలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, డిప్యూటి రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు, టైగర్, అనిమల్ ట్రాకర్స్ ఇద్దరిద్దరూ బృందాలుగా ఏర్పడి గణన కార్యక్రమం చేస్తున్నారని ఆయన చెప్పారు.

Forest |

పెద్ద పులుల, చిరుతపులుల గణనతోపాటు శాకాహార, మాంసాహార జంతువుల గణన, చెట్ల, పొదల, గడ్డి జాతుల వివరాలను నమోదు చేస్తారని, 2 కిలోమీటర్లు సరళరేఖగా 3 రోజుల్లో 6సార్లు 15 కిలోమీటర్లు నడిచి, వాటి పాదముద్రలు, మలాన్ని గుర్తించి, వాటి ఉనికిని, సంఖ్యను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేస్తారని ఆయన తెలిపారు. రాబందులు, ఇతర పక్షి జాతులను గుర్తిస్తారని ఆయన చెప్పారు.

Leave a Reply