Forest | రూ.60వేల టేకు కలప పట్టివేత

Forest | రూ.60వేల టేకు కలప పట్టివేత

Forest | జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి రేంజ్ పరిధిలోని కలమడుగులో ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.60వేల విలువ చేసే14 టేకు దుంగలను పట్టుకున్నట్లు స్థానిక ఫారెస్ట్ రేంజ్(Forest Range) ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ మంగళవారం సాయంత్రం తెలిపారు.

ఆ కలపను మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రామడుగు వెంకటేష్ నిల్వ ఉంచినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు రవి,హన్మంతరావు, రాజేశ్వర్, తన్వీర్ పాషా, బేస్ క్యాంపు ఉద్యోగులు అక్కడికి వెళ్లి ఆ కలప దుంగలను పట్టుకున్నామన్నారు. ఆ కలపను జన్నారంలోని కలప డిపోకు తరలించామని ఆయన తెలిపారు.

తపాల్ పూర్ లో రూ.43వేల కలప పట్టివేత

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్‌పూర్ లో దావనపల్లి మల్లయ్య,వాకటాపురం లింగన్న ఇండ్లలో మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించి,రూ. 43 వేల15 టేకు కలపచెక్కిన దుంగలను పట్టుకున్నట్లు తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు తెలిపారు. గ్రామానికి చెందిన మల్లయ్య ఇంట్లో రూ.15వేల విలువైన 4టేకు కలప చెక్కిన దుంగలను,లింగన్న ఇంట్లో రూ.28వేల విలువైన 11 టేకు కలప చెక్కిన దుంగలను పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.ఆ కలపను రేంజుకు తరలించామని ఆమె చెప్పారు.

Leave a Reply