Forest CCF | ఇండ్ల నిర్మాణానికి అనుమతులిప్పిస్తాం….

Forest CCF | ఇండ్ల నిర్మాణానికి అనుమతులిప్పిస్తాం….
Forest CCF | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్కూరు మండలంలోని దొంగ చింత పంచాయతీలోని కొలం గిరిజనులకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన చెందవద్దని ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఫారెస్ట్ సీసీఎఫ్(Forest CCF)తో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనులకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దొంగ చింత పంచాయతీలోని మారుమూల గ్రామమైన కుమ్మరి కుంట గ్రామాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్ ప్రతినిధి మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజన్, అధికారులు సందర్శించారు.
ఆ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. దొంగ చింత పంచాయతీకి రోడ్డు వంతెన నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం నుండి కొలం ఆదివాసి గిరిజనులకు పర్యాటక సందర్శన కార్యక్రమానికి తీసుకువెళ్తామని అన్నారు. నిరుపేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి, ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పోలీస్ శాఖ(Police Department) ద్వారా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషకరమని పోలీసులు శాంతి భద్రతతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం హర్ష నీయమన్నారు. అదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆదివాసి గిరిజనులకు తాను కల్చర్ మంత్రిగా ఈ ప్రాంతం నుండి ప్రత్యేక బస్సులు పెట్టి హైదరాబాదులోని టూరిజం ప్రదేశాలు విమానాశ్రయంలో విమానాల ఎలా ఉంటాయని చైతన్య పరచడానికి వారిలో మార్పు తేవడానికి ఈ ప్రాంతం వారిని టూరిజం తీసుకు వెళ్లే ఆలోచన చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
పోలీస్ శాఖ ద్వారా అందించిన దుప్పట్లను మంత్రి ఎమ్మెల్యే ఎస్పీ అధికారులు నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్(Adilabad) డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాల చారి, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జై వంతరావు, సర్పంచ్, ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు దాస0డ్ల ప్రభాకర్, మండల నాయకులు, పోలీసు ఉద్యోగులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
