Forest | వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది…

Forest | వికారాబాద్ జిల్లాకు భవిష్యత్తు ఉంది…

Forest | వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలంగాణ డా. సి. సువర్ణ, ఐ. ఎఫ్. ఎస్. డాక్టర్ ప్రియాంక వర్గీస్, ఐ. ఎఫ్. ఎస్. చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, చార్మినార్ సర్కిల్, రంజిత్ కుమార్ నాయక్, ఐ. ఎఫ్. ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎకో టూరిజం అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించి తగు సూచనలు చేశారు. దీనిలో భాగంగా అనంతగిరి అర్బన్ పార్క్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

నగర్ వన్ యోజన పథకం కింద కొడంగల్ రేంజ్ లో అప్పాయిపల్లి అర్బన్ పార్క్, పరిగి రేంజ్ లో జాఫర్ పల్లి అర్బన్ పార్క్, తాండూర్ రేంజ్ లో గొట్లపల్లి అంతారం అర్బన్ పార్క్, వికారాబాద్ రేంజ్ లో అనంతగిరి అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. KADA నిధులతో కోడంగల్ రేంజ్ లో బొంరాస్ పేట్ లో మరొక అర్బన్ పార్క్ ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయని డా. సి. సువర్ణ, ఐ. ఎఫ్. ఎస్. తెలిపారు. వికారాబాద్ లో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని డాక్టర్ ప్రియాంక వర్గీస్ అన్నారు. పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కలిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వికారాబాద్ జిల్లా సుపెరింటెండ్ ఆఫ్ పోలీస్, శ్రీమతి స్నేహ మెహ్రా, ఐ. పి. ఎస్, జిల్లా అటవీ శాఖ అధికారి జి. జ్ఞానేశ్వర్ , వికారాబాద్ రేంజ్ ఆఫీసర్, కె. శ్యామ్ కుమార్, అటవీ శాఖ అధికారుల పాల్గొన్నారు.

Leave a Reply