Foreign Tour | థాయిలాండ్‌ పర్యటనలో మోదీ

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం థాయిలాండ్‌లో బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్న మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

థాయ్ ప్రధాని షేటోంగ్ టార్న్ షినవత్రాతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతేగాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమి సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే అవకాశం ఉంది.

ఈ సమ్మిట్‌కు థాయ్ పీఎం పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక పీఎం హరిణి అమరసూర్య సైతం హాజరుకానున్నారు. 2018లో నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం. చివరి శిఖరాగ్ర సమావేశం 2022 మార్చిలో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్‌లో జరిగింది. ప్రధాని మోదీ పర్యటన గురించి థాయిలాండ్‌లోని భారత రాయబారి నగేష్ సింగ్ స్పందించారు. మోదీ పర్యటనతో థాయిలాండ్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొందన్నారు.

Leave a Reply