అదనపు కట్నం కోసం

  • ఆత్మహత్యకు ప్రేరణ ఫలితం

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా(Nandyal District) కొలిమిగుండ్ల మండలం(Kolimigundla Mandal) చింతల పల్లె గ్రామం(Chintalapalle Village)లో భార్య రాజేశ్వరిని అదనపు కట్నం(Court Verdict) కోసం వేధించి ఆత్మహత్య(Suicide Case) ప్రేరేపించిన భర్త కృష్ణయ్య కు పదేళ్ల జైలు, రూ.4వేలు జరిమాన విధిస్తూ నంద్యాల ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి తంగమణి మంగళవారం తీర్పు చెప్పారు.

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హరినాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు, కొలిమిగుండ్ల మండలం చింతలయ పల్లె గ్రామానికి చెందిన రాజేశ్వరికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన కనకం క్రిష్టయ్యతో 2006 లో వివాహం జరిగింది.

వీరి దాంపత్యం 12 ఏళ్లు అన్యోన్యంగా సాగింది. తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి రాజేశ్వరిని భర్త కృష్ణయ్య, అతడి చిన్నాయన నారాయణు కలిసి అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ వేధింపులు భరించలేక రాజేశ్వరి జీవితంపై విరక్తి చెంది 2022 మార్చి 4న చింతలయ పల్లెలో పురుగుమందు తాగింది.

తాడిపత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో చనిపోయింది. ఆమె తండ్రి నంద్యాల గోపాల్ ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీసు స్టేషన్ క్రైమ్ నెంబర్ 50/2022 యూ/ఎస్ 498(ఏ)((IPC 498A)), 306 ఆర్/ డబ్ల్యు (IPC 306)34 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు.

నంద్యాల కోర్టులో అడిషనల్ పి పి మోతీలాల్ నాయక్ వాదనలు వినిపించారు. నిందితుడు కనకం కృష్ణయ్యను నంద్యాల ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి తంగమణి దోషిగా నిర్ధారించారు.. ఐపీసీ 498. ఏ సెక్షన్ కింద మూడేళ్లు జైలు శిక్ష రూ. 2000 లు జరిమానా విధించారు.

ఆత్మహత్య(suicide)కు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ 306 కింద 7 ఏళ్లు జైలు శిక్ష, రూ. రెండువేలు జరిమానా విధించారు. మొత్తం పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారని ఇన్వెస్టిగేషన్ అధికారి తెలిపారు.

Leave a Reply