AP | కేజీబీవీలో ఫుడ్ పాయిజన్… నలుగురు విద్యార్థులకు అస్వస్థత
నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో :నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయం లేదని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి పి.జనార్దన్ రెడ్డి.. సర్వశిక్షా అభియాన్ ఏపీసీ ప్రేమంతకుమార్ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.