Food Poisoning | విద్యార్థులకు హరీష్ రావు పరామర్శ
Food Poisoning | హైదరాబాద్, ఆంధ్రప్రభ : బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హరీష్ రావు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పాఠశాలలో ఆహార నాణ్యతపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

