Food donation | ఎన్నారై ఆధ్వర్యంలో మహా అన్నదానం

Food donation | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నారై ఆధ్వర్యంలోమాఘ పౌర్ణమి శ్రీ లలిత దేవి మాత అమ్మవారి జయంతి పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం 34 డివిజన్ శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ఆలయ పూజారులు, అభిషేక్ శర్మ, కృష్ణ శర్మ పూజలునిర్వహించారు. అనంతరం వడ్నాల సదానందం పద్మ దంపతుల కూతురు ఎన్నారై వాస్తవ్యులు వరద వెంకటముని శ్యామ్ దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో పాశికంటి రాజేశ్వరరావు, చామంతుల బిక్షపతి, వడ్నాల నరేందర్, పిట్ట భాస్కర్, తౌటం మధు, బైరి శ్యాం, బైరి వేణు, రాపెళ్లి చంద్రమౌళి, దాసి సురేందర్, చిదురాల రాజేందర్, కోటి, కస్తూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply