ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు…

ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు…
పాయకాపురం, ఆంధ్రప్రభ : వాహనాల,వాహనచోదకులు ప్రమాద బారిన పడకుండా ప్రధాన కూడలిలో ట్రాఫిక్ పోలీసులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రభాకర్ శనివారం సింగ్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
ఫ్లైఓవర్పై మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని, ఓవర్ టేక్ చేయవద్దని, యూ టర్న్ చేయవద్దని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. జీరో ప్రమాదాలు స్థాపనే ప్రభుత్వ ధేయమని సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు.
