మక్తల్, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ) : భీమా ప్రాజెక్టు (bheema project) లో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల (rains) వల్ల పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. మక్తల్ ప్రాంతం తో పాటు రిజర్వాయర్ కు ఎగువ భాగాన కర్ణాటక (Karnataka) లోనూ పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్ లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండడంతో గత రెండు రోజుల క్రితం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

ఇవాళ వరద ఉధృతి మరింత పెరగడంతో ఐదు స్పిల్ వే గేట్ల (Five spillway gates) ను ఎత్తి దిగువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ లోకి 3000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అదే స్థాయిలో ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 3.317 టిఎంసి కాగా ప్రస్తుతం 2.58 టీఎంసీల నీరు రిజర్వాయర్ (Reservoir) లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వరద మరింత పెరిగితే మళ్లీ మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply