22 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
4 గేట్ల ద్వారా 12వేల500 క్యూసెక్కుల విడుదల
మెండోర, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజికవర్గం మెండోర మండలంలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఈ రోజు ఉదయం 22,154 క్యూసెక్కుల వరద చేరిందని అధికార్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1091 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. దీంతో అధికారులు అప్రమతమై ఈ రోజు ఉదయం ఏడు గంటలకు 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, సరస్వతి కాలువ 650, లక్ష్మి కాలువ 200, కాకతీయ కాలువ ద్వారా 4000, లక్ష్మి కాలువ 20,మిషిన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతుందని తెలిపారు. 573 క్యూసెక్కుల ఆవిరి అవుతుంది.


