Flexi | బీఆర్ఎస్ నేతలతో ప్రాణభయం..

Flexi | బీఆర్ఎస్ నేతలతో ప్రాణభయం..
- మాజీ కౌన్సిలర్ కుటుంబ ఆవేదన
Flexi | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్ల తమ కుటుంబానికి ప్రాణభయం ఉందంటూ మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ రాజమౌళి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త సామాజిక కార్యకర్త అయిన నాగవెల్లి రాజ లింగమూర్తిని అతి కిరాతకంగా హత్య చేసిన నాయకుడిని మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి వెనుకేసుకొస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్ కార్నర్ మీటింగ్ నేపథ్యంలో తన భర్త ఫ్లెక్సీలను తొలగించారని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో అవే ఫ్లెక్సీలు తొలగించలేదని ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్షసాధింపుగా వారు ఆరోపించారు. ఈ అన్యాయానికి నిరసనగా ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రాజమౌళి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నేడు తమ భర్తను హత్య చేసిన వారే బిఆర్ఎస్ ప్రచారంలో పాల్గొంటున్నారని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
