Flag March | ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు
- బెల్లంపల్లి, మైలారం గ్రామాల్లో 35 మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్
- “ప్రజల్లో నమ్మకం, ఎన్నికల్లో శాంతి భద్రతే లక్ష్యం” — ఏసీపీ రవి కుమార్
Flag March | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని బెల్లంపల్లి ఏసీపీ ఎ. రవికుమార్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నెన్నెల పోలీస్‌స్టేషన్(Police Station) పరిధిలోని నెన్నెల, మైలారం గ్రామాల్లో ఎస్‌ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు ఫ్లాగ్ మార్చ్(flag march) నిర్వహించాయి.
ఏసీపీ రవికుమార్, సీఐ హనోక్ పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామాల్లో ప్రధాన రహదారులు, వార్గుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో నమ్మకం పెంచేలా, చట్టం-శాంతి భద్రత పట్ల భరోసా కలిగించేలా ఫ్లాగ్ మార్చ్ సాగిందని ఏసీపీ(ACP) తెలినారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి, ఏవైనా అక్రమ చర్యలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
గ్రామాల్లో శాంతి భద్రత కోసం ఫ్లాగ్ మార్చ్‌తో పాటు పెట్రోలింగ్(patrolling)ను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రజలు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయడానికి పటిష్ట భద్రతా బందోబస్తు చేపట్టినట్టు ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. “శాంతియుత ఎన్నికలే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవి కుమార్, సీఐ హనోక్, తాళ్లగురిజాల ఎస్సై రామకృష్ణ, నెన్నెల ఎస్సై ప్రసాద్ తో పాటు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


