Panyam | ఇంటి గోడ కూలి ఐదేళ్ల‌ బాలుడు మృతి..

నంద్యాల బ్యూరో, జూలై 12, ఆంధ్రప్రభ : నంద్యాల (Nandyala) జిల్లా పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో ఇంటిగోడ కూలి ఐదు సంవత్సరాల బాలుడు మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు… తొగర్చేడు (Thogarchedu) గ్రామంలో పాత ఇంటికి మరమ్మతులు పనులు చేపట్టారు.

గోడ ప్రక్కనే ఆడుకుంటున్న ఐదేళ్ల ఆరిఫ్ (Arif) అనే బాలుడిపై గోడకూలి పడింది. అదే సమయంలో అతని పక్కన ఉన్న ఆరిఫ్ తాత కరిముల్లా (Karimullah కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆరిఫ్ ను మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొలుకోలేక చిన్నారి ఆరిఫ్ మృతి చెందాడు. కరిముల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply