నీట మునిగిన ఐదు వేల ఎకరాలు
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : ఒక వైపు మంజీర నది(Manjira River)లో నీటి ఉధృతి.. మరో వైపు నిజాంసాగర్ బ్యాక్ వాటర్(Nizamsagar Backwater) పోటెత్తడంతో సుమారు ఐదు వేల ఎకరాల పంట పొలాలులు మునిగిపోయాయి.
దీంతో రైతులు(Farmers) లబోదిబోమంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు(Singur Project) గేట్లు ఎత్తివేయడంతో మంజీర నదిలోకి నీరు చేరుతోంది. దీంతో మంజీర నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే నిజాం సాగర్ బ్యాక్ వాటర్ పోటెత్తోంది. గత నెలరోజులుగా నిజాం సాగర్ బ్యాక్ వాటర్ వల్ల నీటిలోనే మగ్గుతున్నపంట పొలాలు ఈ రోజు మరోసారి ఇంకనూ ముందుకు వచ్చి మరిన్ని పంట పొలాలను ముంచివేసింది.