FISHERMEN | మత్స్యకారుల దినోత్సవం
FISHERMEN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని ముదిరాజ్ భవనంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని(Fishermen’s Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య భవన్ లో మత్య్సకారుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రపంచ మత్స్యకార దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కోళ్ల వెంకటేష్, ఉపాధ్యక్షుడు వాకిటి శ్యామ్ కుమార్, వల్లంపల్లి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖర్, అంజయ్య ఆచారి, తిరుపతి నరసింహులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

