కాపాడిన మత్స్యకారులు

కాపాడిన మత్స్యకారులు

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దక్షిణ చిరువోలులంక గ్రామంలో కృష్ణానది లో పుష్కర ఘాట్ వద్ద స్నానానికి వెళ్లి అకస్మాత్తుగా పడిపోయిన రామచంద్రాపురం గ్రామస్థుడు బచ్చు మురళి (ఖాని) ని వడుగువారిపాలెంకు చెందిన మత్స్యకారులు సోమవారం కాపాడారు. చెరువులు దగ్గర కాపలా ఉండే వెంకన్న రేవు మధ్యలో మనిషి కనపడగానే వెనువెంటనే అక్కడ దగ్గరలో ఉన్న వడుగువారిపాలెం గ్రామస్తులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన మత్స్యకారులు రెండు బృందాలుగా ఏర్పడి పడవ సహాయంతో అతన్ని వి.కొత్తపాలెం దగ్గరలో పడవలో ఎక్కించుకుని దక్షిణ చిరువోలులంక పుష్కర ఘాట్ దగ్గర వారి బంధువులకు అప్పగించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సరైన సమయంలో స్పందించిన మత్స్యకారులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కొక్కిలిగడ్డ సుత్తులబాబు, మోపిదేవి ప్రశాంత్, నడకుడిటి నరేంద్ర, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply