First Song | సరికొత్త కథతో వస్తున్న విష్ణు..

First Song | సరికొత్త కథతో వస్తున్న విష్ణు..

First Song | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీకి యధునాథ్ మారుతిరావు డైరెక్టర్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు (Movies) చేసి సక్సెస్ సాధించే విష్ణు ఈసారి విష్ణు విన్యాసం అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ చేశారు. ఇంతకీ.. ఈ సాంగ్ ఎలా ఉంది..?

First Song | సరదా వేడుకగా..

వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి దేఖో విష్ణు విన్యాసం అనే సాంగ్ రిలీజ్ చేశారు. సరదాగా సాగే ఈ సాంగ్ హీరోకి జ్యోతిష్యం పై ఉన్న పిచ్చిని ప్రజెంట్ చేస్తోంది. ప్రతి బీట్, ప్రతి పదం, ప్రతి ఎక్స్ ప్రెషన్ విష్ణు పాత్ర జాతకాలను జీవితానికి మార్గదర్శకంగా ఎలా భావిస్తుందో తెలియజేసాయి. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, రథన్ మ్యూజిక్ (Radhan Music) అందించారు. శ్రీకృష్ణ పవర్ ఫుల్ వోకల్స్ ఈ పాటను మూఢనమ్మకాల పై ఒక సరదా వేడుకగా మార్చాయి అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఈ సాంగ్ ఈ మూవీకి హెల్ప్ అవుతుంది.. థియేటర్స్ లో ఈ సాంగ్ మరింతగా ఆకట్టుకోవడం ఖాయమని టాక్.

First Song

First Song | కొత్త ఎక్స్ పీరియన్స్..

నయన సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ (Release) చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీవిష్ణు తన ప్రతి సినిమాతో ఆడియన్స్ కి ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఈమధ్య ఓ పెద్ద సక్సెస్ సాధించాలని ట్రై చేస్తున్నాడు కానీ.. వర్కవుట్ కావడం లేదు. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు.. ఈ మూవీతో ఆశించిన విజయాన్ని సాధిస్తాడేమో చూడాలి.

First Song

CLICK HERE TO READ సీతా పయనం నుండి సాంగ్ రిలీజ్

CLICK HERE TO READ MORE

Leave a Reply