- ఇంద్రవెల్లి మండలంలో 66.94% పోలింగ్ నమోదు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లి మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పండుగ వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు సాగాయి.
మొత్తం 66.94% పోలింగ్ నమోదైంది. మండలంలో ఉన్న 29 గ్రామపంచాయతీలలో హార్కపూర్ తండా అత్యధికంగా 87% పోలింగ్ నమోదు చేయగా, అత్యల్పంగా ఇంద్రవెల్లి ‘బి’లో 67.74% పోలింగ్ నమోదైంది.
మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు చెందిన మొత్తం 29,648 మంది ఓటర్లలో 19,846 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు త్రాగు నీరు, వీల్‌చైర్లను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు.


