AP | విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం..
విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కోక్ ఓవెన్ బ్యాటరీ 2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పని జరుగుతుండగా మంటలు చెలరేగటంతో.. అక్కడ పని చేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడి నుంచి తప్పించుకోగా.. ఒకరికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.