Vikarabad | ఎస్బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ: తాండూరు మండలం కరణ్‌ కోట్ గ్రామంలోని ఎస్బీఐ శాఖ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా కరణ్‌ కోట్‌ పరిధిలో ఎస్బీఐ బ్యాంకు శాఖ కొనసాగుతోంది. ఈ బ్యాంకులో ప్రజలకు, రైతులకు, వ్యాపారులకు ఖాతాల ద్వారా లావాదేవీలు అందిస్తోంది.

అయితే ఇవాళ ఉదయం బ్యాంకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా పెరుగుతూ బ్యాంకు మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అందులోని వారంతా బయటకు పరుగులు తీశారు. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపుచేసే ప్రయత్నం ఫలించలేదు. మంటలు పూర్తిగా వ్యాపించాయి. వెంటనే తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయనే కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Leave a Reply