బాగ్దాద్: ఇరాక్ (Iraq) లోని ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం (Major fire) జరిగింది. ఈ ఘటనలో సుమారు 50మంది మృతిచెందారు. అల్-కుట్లోని ఓ సూపర్ మార్కెట్లో ఈ ఘటన జరిగిందని ఇరాక్ మీడియా పేర్కొంది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియా (Social media) లో వైరల్ గా మారాయి. భవనం మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగలు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం వెంటనే తెలియలేదు, కానీ దర్యాప్తు నుండి ప్రాథమిక ఫలితాలను 48 గంటల్లో ప్రకటిస్తామని గవర్నర్ చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.