వికారాబాద్ టౌన్, మార్చి 6 ( ఆంధ్రప్రభ): అనంతగిరి రోడ్డులో అంటుకుపోతున్న అడవి గురువారం ఉదయం రోడ్డు పక్కన ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే మంట పెట్టారో, లేక బీడీ, సిగరెట్ వంటివి కాల్చి పారవేశారో కానీ రోడ్డు పక్కన అడవి అంటుకున్నది. గమనించిన వాకర్స్ వెంటనే చెట్ల రెమ్మ ఆకులతో మంటలు అడవిలోకి ప్రవేశించకుండా రిస్కు తీసుకొని ఆర్పివేశారు.
ఈ అనంతగిరి రోడ్డులో తరచుగా అడవి అంటుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అడవి రోడ్డుకు ఇరువైపులా అంటుకుంటుంది. అయితే ఇది జరుగుతుందనే విషయం అటవీశాఖ అధికారులు గమనించలేకపోతున్నారు. అటవీ శాఖ వారు ప్రతి సంవత్సరం రోడ్డుకు ఇరువైపులా ఫైర్ ల్యాండ్ వంటివి చేపడతారు. అయినా ఏదో ఒకచోట ఈ మంటలు అంటుకుంటున్నాయి. అడవి చెట్ల ఆకులు రాలి పూర్తిగా ఆకులు ఎండిన సమయం కాబట్టి ఎక్కడ అడవి అంటుకున్నా అడవి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉంది.. కాబట్టి అధికారులు అడవి అంటుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.