తిరుపతిలో తృటిలో తప్పిన ప్రమాదం..
ప్రయాణీకులు సురక్షితం..
(ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) : తిరుపతి (Tirupati) జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి స్వర్ణముఖి అపార్ట్ మెంట్ సమీపంలో వోల్వో బస్సు కాలిపోగా (BusFire).. ప్రయాణికులు ఆందోళనలో బస్సు నుంచి దూకేశారు. బస్సులో మంటలు చెలరేగిన తరుణంలో ఎమెర్జెస్సీ డోర్ తీసుకుని ప్రయాణికులు, డ్రైవరూ దూకేశారు. ప్రమాద స్థలికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.