Fire | మద్యం మత్తులో గుడిసెకు నిప్పు

Fire | మద్యం మత్తులో గుడిసెకు నిప్పు

Fire | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : మద్యం మత్తులోతన గుడిసెకు నిప్పున పెట్టిన సంఘటన మండలంలోని తోషం తండాలో చోటు చేసుకుంది. గుడిహ‌త్నూర్ గ్రామానికి చెందిన జాదవ్ గణేష్ రాత్రి మద్యం మత్తు(Alcohol intoxication)లో పశువుల కొట్టానికి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ(fire department) అధికారులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు

Leave a Reply