షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం

మూడు ఇండ్లు రెండు ఆవుల కోట్టాలు దగ్ధం


నేరడిగొండ,ఆంధ్రప్రభ : మండలంలోని బోరిగం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు,ఆవుల కొట్టంలు రెండు పూర్తిగా కాలిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ వెంటనే గ్రామానికి చేరుకుని స్థానిక సర్పంచ్ వినేష్ తో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఆడే గజేందర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

బాధితుల పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కొత్త ఇళ్లు మంజూరు చేయించేందుకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు, గ్రామ సర్పంచ్ రాథోడ్ వినీష్,గ్రామ నాయకుడు పవర్ మున్నా మహారాజ్, రాథోడ్ మోహన్,రాథోడ్ మదన్ సింగ్, పవర్ సోవన్,రాథోడ్ పూల్ సింగ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, యండి సద్దాం,జాద

Leave a Reply