Fire | టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం

Fire | టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం
రూ. 6 లక్షల మేర ఆస్తి నష్టం
Fire | మోత్కూరు,ఆంధ్రప్రభ: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఓ టైల్స్ దుకాణం లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని గ్రానైట్స్ షోరూమ్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఆస్తి నష్టం సంభవించింది. స్థానిక మోత్కూర్-రాయగిరి రోడ్డు లో తిరుపతి టైల్స్ అండ్ గ్రానైట్స్ షాపులో మంటలు అంటుకోవడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదంలో షాపులోని విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయని షాపు యజమాని రవిశైని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని తెలిపారు. సుమారు రూ. 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

