Financial Support | వైద్య చికిత్సకు అండగా వసుధ ఫౌండేషన్

Financial Support | భద్రాచలం, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న బూర్గంపాడు మండలం గౌతమీపురంకు చెందిన హుస్సేన్ బి, భద్రాచలంకు చెందిన వెంకటేశ్వర్లు తమకు వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని వసుధ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన వెంకట రామరాజును అభ్యర్థించారు. ఈ క్రమంలో సానుకూలంగా స్పందించిన ఆయన వారు ఇరువురికి ఆర్థిక సహాయం అందించాలని వసుధ ఫౌండేషన్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజును కోరారు.
ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండలం గౌతమిపురంకు చెందిన హుస్సేన్ బి కి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదేం వీరయ్య చేతుల మీదుగా రూ.పదివేలను భద్రాచలంలో అందజేశారు. వెంకటేశ్వర్లుకు వైద్య చికిత్స కోసం ఆయన సతీమణి నాగలక్ష్మికి రూ.5 వేలు భద్రాద్రి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.రవీంద్రనాథ్ అందజేశారు.
