ఆపదలో వున్న స్నేహితునికి ఆర్థిక సహాయం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న హసన్ పర్తి మండలం పెంబర్తిలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మేకల పుల్లయ్యను 1989-90 బ్యాచ్ కి చెందిన 10వ తరగతి మిత్రులు పరామర్శించి, మనో ధైర్యాన్ని కల్పించారు.ఈసందర్బంగా పుల్లయ్యతో మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఈ మేరకు మిత్రులు దవాఖాన ఖర్చుల నిమిత్తం పెంబర్తి గ్రామప్రజలు,దాతల సహకారంతో వసూలు చేసిన 35 వేలను పెంబర్తి గ్రామ సర్పంచ్ తాళ్ళపెల్లి కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి హేమలతల చేతులమీదుగా పుల్లయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ బంధాలన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో, 35 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న ఒకే ఒక కారణంతో మిత్రుడి ఆర్థిక అవసరాన్ని, గుర్తించి అండగా నిలబడిన మిత్ర బృందం సేవానిరతిని కొనియాడాడు.

ఈ కార్యక్రమంలోఎలుకరాజు సదానందం, దండుగుడం రాజుకుమార్.ఆరెల్లి వెంకటస్వామి,కె పరమేశ్వర చారి,మట్టెడ యుగంధర్,కందగట్ల శ్రీనివాస్,మేకల రవీందర్,బాలు.చాతల్ల సదానందం పాల్గొన్నారు.పరిస్థితిని తెలుసుకొని కష్టంలో తనకు అండగా నిలబడినమిత్ర బృందానికి,గ్రామ సర్పంచ్,కార్యదర్శి దాతలందరికి పుల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply