అగ్నిప్రమాద బాధితులకు పరుచూరి ఆర్థిక సాయం..

అగ్నిప్రమాద బాధితులకు పరుచూరి ఆర్థిక సాయం..
చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం మంగళాపురంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కర్రా లక్ష్మయ్య కుటుంబానికి మంగళాపురం పీఏసీఎస్ ఛైర్ పర్సన్, ప్రజాప్రగతి సేవాసంఘం అధ్యక్షులు పరుచూరి వెంకటేశ్వరరావు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు.
డీఆర్వో సీసీ తూము వెంకటేశ్వరరావు బాధిత కుటుంబం పరిస్థితిని తెలియచేయటంతో స్పందించిన పరుచూరి వెంకటేశ్వరరావు నగదు సాయాన్ని సీసీ ద్వారా అందచేశారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి ఆర్ఐ ఘంటసాల కృష్ణమోహన్, చల్లపల్లి రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ఛైర్మన్ నడకుదురు లీలాబ్రహ్మేంద్ర, కోశాధికారి ఎండి.ఏ.కే.జిలానీ, విశ్రాంత ఆర్ఐ తూము కోటేశ్వరరావు ఉన్నారు.
