ఎట్టకేలకు మురికి గుంతకు మోక్షం

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక రైతు వేధిక నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంకు వెళ్లే దారిలో కొన్ని సంవత్సరాలుగ రోడ్డుపై మురుగు నీరు నిలిచి పెద్ద గుంతగా ఏర్పడింది. అధికారులు పట్టించుకోకపోవడంతో బాటచారులు, వాహనాలు వెళ్ళడానికి వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్నా వెంచర్ నుండి వెళుతున్నారు. ఈ విషయాన్ని నూతనంగా ఎన్నుకోబడిన స్థానిక సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ వెంటనే స్పందించిమురికి నీరు నిలిచి గుంతగా ఏర్పడిన రోడ్డులో నీరు కిందికి వెళ్ళేవిదంగా సిమెంట్ పైపులు ఏర్పాటు చేసి వాటిపై నుండి మట్టి పోసి రోడ్డుని పునరుద్ధరణ చేశారు. కొన్ని సంవత్సరాలుగ పాడైపోయిన రోడ్డును దగ్గరుండి పునరుద్దరణ చేసిన సర్పంచ్ వీరమళ్ళ శిరీషలోకేష్ గౌడ్ పట్ల అటుగా వెళ్లే గ్రామస్థులు, బాటసారులు, వాహనదారులు సంతృప్తి వ్యక్త పరిచారు.

Leave a Reply