Kerala | సినిమా షూటింగ్‌లు, ప్రదర్శనలు బంద్..
- సమ్మేకు పిలుపునిచ్చిన మలయాళ చిత్ర పరిశ్రమ
మలయాళ చిత్ర పరిశ్రమ సమ్మెకు పిలుపునిచ్చింది. కేరళ ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లను నెరవేర్చకపోవడంతో సమ్మె చేస్తున్నట్టు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించాయి. ఈ మేరకు జూన్ 1న మలయాళ పరిశ్రమ సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించాయి.
కేరళలో అధిక ఎంటర్‌టైనమెంట్ ట్యాక్స్ పాటు.. జీఎస్టీ, నటీనటులు, సాంకేతిక నిపుణులు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే అధిక పన్నులతో పాటు, నటీనటుల పారితోషికాన్ని నిరసిస్తూ జూన్ 1 నుండి అన్ని సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో సినిమాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించాయి.