బీసీ రిజ‌ర్వేష‌న్ సాధించే వ‌ర‌కు పోరాటం

బీసీ రిజ‌ర్వేష‌న్ సాధించే వ‌ర‌కు పోరాటం

రేపు బీసీ బంద్ విజయవంతం చేయాలి

దండేపల్లి, అక్టోబర్17(ఆంధ్రప్రభ): ఈ నెల 18న నిర్వహించనున్న బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని మున్నూరు కాపు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాండ్ల సత్యనారాయణ, జాబు సుగుణాకర్, కోశాధికారి చీట్ల శ్రీనివాస్ కోరారు. ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని తీర్మానం చేసి గవర్నర్‌కు పంపి ఆరు నెలలు అయినా స్పందన లేదన్నారు. బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందని, దానిని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తే అక్కడ కూడా కొట్టివేయడం సరైంది కాదన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఏ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. బీసీ సబ్బండ వర్గాలు ఐక్యంగా ఉండి రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply