Fields | కోతుల బీభత్సం

Fields | కోతుల బీభత్సం

Fields | కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని తుంగపల్లెమ్మ గుడి సమీప ప్రాంతాల్లో మినుము చల్లిన పొలాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వందల సంఖ్యలో ఉన్న కోతులు పొలాల్లోకి దూసుకెళ్లి మినుము మొక్కలను పీకివేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి కోతుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply