disciplin |కానిస్టేబుల్ వ్య‌వ‌స్థ పోలీస్ శాఖకు వెన్నెముక

disciplin |కానిస్టేబుల్ వ్య‌వ‌స్థ పోలీస్ శాఖకు వెన్నెముక

  • చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి

disciplin | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కానిస్టేబుల్ అనేది పోలీస్ శాఖకు వెన్నెముక వంటిదని, ఫీల్డ్ స్థాయి(Field level)లో కానిస్టేబుళ్ల కృషిపైనే శాంతి భద్రతల వ్యవస్థ నిలబడి ఉంటుందని జిల్లా పోలీస్ అధికారి తుషార్ డూడి స్పష్టం చేశారు. ఎస్సీటీపీసీల శిక్షణ ప్రారంభం నేపథ్యంలో మంగళవారం విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న చిత్తూరు జిల్లాకు చెందిన 196 మంది(196 people) అభ్యర్థులతో సోమవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.

కష్టపడి చదివి, శారీరక పరీక్షలు, రాత పరీక్షలు అన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసి ఈ స్థాయికి చేరుకోవడం సులభం కాదని అభ్యర్థులను ప్రశంసించారు. అంకితభావం, క్రమశిక్షణ(discipline), పట్టుదల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. కానిస్టేబుళ్లు లేకుండా పోలీస్ శాఖను ఊహించలేమని, రోడ్డు భద్రత, నేర నియంత్రణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి ప్రతి అంశంలో కానిస్టేబుల్ పాత్ర కీలకమని తెలిపారు.

ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అవకాశం అని, ఇకపై అభ్యర్థుల ప్రవర్తన, మాటతీరు, క్రమశిక్షణ పోలీస్ శాఖ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాయని చెప్పారు. ఎక్కడ ఉన్నా, ఏ విధి నిర్వర్తించినా ప్రజలు మిమ్మల్ని పోలీస్ ఉద్యోగి(police employee)గా చూస్తారని, అందువల్ల బాధ్యతతో, నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు.

విజయవాడకు వెళ్లే అభ్యర్థుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని తెలిపారు. రవాణా(transportation) కోసం బస్సులు కేటాయించామని, ప్రతి బస్సుకు ఒక ఇన్‌చార్జ్‌ను నియమించామని చెప్పారు. ప్రయాణ సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. రాబోయే శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పోలీస్ ఉద్యోగులుగా తయారై, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడకు బయలుదేరిన అభ్యర్థుల బస్సులను జిల్లా పోలీస్ అధికారి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సమావేశంలో జిల్లా పోలీస్ శిక్షణ(police training) కేంద్ర అధికారులు, ఉప విభాగ అధికారులు, సాయుధ దళ అధికారులు, పరిశీలకులు, ఉప పరిశీలకులు మరియు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply