ఫెస్టివ్ మారథాన్

ఫెస్టివ్ మారథాన్

ఇక బంగారం ధర దూకుడే

( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) గత నెలలో .. బంగారం ధరను నిలకడగా నిలబెట్టి.. బంగారం ప్రేమికులను ఊరించిన బులియన్ మార్కెట్ .. ఇక తన ప్రతాపం చూపిస్తోంది. పండగ వేళ బంగారం కొనుగోలుకు బయలుదేరే వేళ.. ధర స్థిరంగా వెల్కమ్ చెబితే.. దసరా శుభాకాంక్షలతో బులియన్ మార్కెట్ ..చలికాలానికి ముందే ధర నెగడు రగిల్చింది. గత నెల రోజులు .. 10 గ్రాముల బంగారం ధరను కేవలం రూ.10లు మాత్రమే పెంచిన ఈ మార్కెట్.. మంగళవారం చుక్కలు చూపించింది. ఇక బుధవారం కూడా … మంగళవారం రాత్రి ధరలను ఖరారు చేసి..అదనంగా మరో రూ.10లు కలిపి.. ఇప్పుడు కొనకపోతే.. ఈ ధర మళ్లీ లభించదు. ఆలస్యం చేస్తే ఆశాభంగం తప్పదు అనే సంకేతాలను పంపించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో బుధవారం బులియన్ మార్కెట్ లో ధరల పరిస్థితి పరిశీలిద్దాం. మంగళవారం రాత్రి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగాధర రూ.1,17,440లకు చేరగా బుధవారం ఉదయం 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు విజయవాడలో నిన్నటి ధరకూ రూ.10లు జత కలిసింది. అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,450లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,660లకు , 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 88,090లకు చేరింది. -ఇక తెలంగాణలో ఈ రోజు గోల్డ్ లవర్స్ ను ఆకట్టుకునే రీతిలోనే.. ధరల పాచిక నడుపుతోంది. ఈ రోజు కూడా మంగళవారం ధర దూకుడు రుచి చూపించే ప్లాన్ లో ఉంది. నిన్న ప్రారంభ ధర తగ్గించి సాయంత్రానికి భారీగా పెంచేసింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర .. రూ. 1,20,000లు దాటినట్టు విస్తృత ప్రచారం నేపథ్యంలో.. ఈ రోజు బులియన్ మార్కెట్ సమాచారం మేరకు, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,17,450లు.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,07,660లు, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.88,040లకు చేరింది.

నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
వరంగల్ రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
విజయవాడ రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
గుంటూరు రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
విశాఖపట్నం రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
చెన్నై రూ.11,840లు రూ.10,861లు రూ.8,991లు
కోల్కత్త రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు ముంబై రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
ఢిల్లీ రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు
బెంగళూరు రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు కేరళ రూ.11,745లు రూ.10,766లు రూ.8,809లు అహ్మదబాద్ రూ.11,750లు రూ.10,771లు రూ.8,814లు
వడోదర రూ.11,750లు రూ.10,771లు రూ.8,8137లు

Leave a Reply