Festivals | ఘనంగా సద్గురు పూలాజి బాబా సమాధి మహోత్సవాలు

Festivals | ఘనంగా సద్గురు పూలాజి బాబా సమాధి మహోత్సవాలు
- పులాజి బాబా ఆధ్యాత్మిక సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
Festivals | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ లో గల సిద్దేశ్వర సంస్థాన్ ఆలయంలో ఇవాళ శ్రీశ్రీశ్రీ సద్గురు పులాజి బాబా ఎనిమిదవ సమాధి మహోత్సవ పుణ్యతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ ఇన్చార్జి మురళీధర్ రావు, అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు ఉత్తంరావు ఇంగ్లే, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు, నాందేవ్ శశానే ప్రముఖులు పాల్గొని శ్రీ శ్రీ సద్గురు పులాజి బాబా సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు చేసి బాబా ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… ఏజెన్సీ ప్రాంతాల్లో పులాజి బాబా ఆధ్యాత్మిక ధ్యాన సేవలను ప్రారంభించి భావ్య ప్రపంచానికి చాటి చెప్పారని వారు కొనియాడారు. బాబా చూపిన సన్మార్గ ఆధ్యాత్మిక ధ్యాన సేవలు భక్తుల గుండెల్లో నిలిచిపోతాయన్నారు. బాబా నిస్వార్ధంగా కులం, మతం, భేదం, ధనికుడు నిరుపేద లేకుండా ధ్యానాధ్యాత్మిక సేవలు అందించారని వక్తలు కొనియాడారు. బాబా చూపిన సన్మార్గాలతో లక్షలాది కుటుంబాలు చెడు వచనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సన్మార్గంలో నడుస్తున్నాయని పట్నాపూర్ లో పులాజి బాబా పేరట ఆధ్యాత్మిక పాఠశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడతానని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు.
బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్ రావు వక్తలు మాట్లాడుతూ… పులాజి బాబా ఆధ్యాత్మిక ధ్యాన మార్గాలతో వేలాది కుటుంబాలు సన్మార్గంలో నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో పట్నాపూర్ సిద్దేశ్వర సంస్థ ఒక క్షేత్రంగా మారుతుందని అన్ని పార్టీలు పూలాజి బాబా చేసిన మానవసేవ ఆధ్యాత్మిక సేవలను చాటి చెప్పాలని కోరారు. బాబా చూపిన సన్మార్గాలతో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చేసిన సేవలను మానవ జీవితాల్లో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.

ఈవేడుకలకు తెలంగాణ – మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి సద్గురు పూలాజి బాబా ఆలయంలో పూజలు చేసి ఆయన ఆశీస్సులు పొందారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో సిద్దేశ్వర సంస్థ కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైనూర్ సీఐ రమేష్ జైనూర్, సిర్పూర్ (యు) ఎస్ ఐ లు రవికుమార్, రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో జై నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరావు, పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మీబాయి బాలాజీ, డి.ఎస్.పి రఘునాథ్, విద్యుత్ శాఖ ఎస్సీ ఈ శేషారావు, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీరామ్ నాయక్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు నాయకులు, సర్పంచ్ లు సిద్దేశ్వర సంస్థాన్ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

