Festival | ఘనంగా ధనుర్మాసం పూజలు

Festival | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంకలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉభయ దాతలుగా మద్ది వెంకటనారాయణ దంపతులు బండ్రెడ్డి హనుమాన్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అర్చకులు డీవీకే సత్య ప్రసాద్ అలంకరణ పూజ కార్యక్రమాలను నిర్వహించారు. విరివిగా భక్తులు పాల్గొన్నారు.
