Festival | పైడమ్మ తెప్పోత్సవంలో..

Festival | పైడమ్మ తెప్పోత్సవంలో..

  • ఆలయ అధికారులు బిజీబీజీ

Festival | పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణ ప్రజల ఆరాధ్య దేవత, కల్పవల్లిగా భావించే శ్రీ శ్రీ శ్రీ పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలలో భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా తెప్పోత్సవం నిలుతస్తోంది. పెడన పట్టణంలోని ఆలయం కి వెనుక వైపు చెరువులో అమ్మవారు హంస వాహనంపై ముమ్మారు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో మంగళ వాయిద్యాలు, తాళాలు, భజనల నడుమ అమ్మవారి ప్రతిమను ఘనంగా తెప్పపై ప్రతిష్టించనున్నారు. చెరువులో హంసాకారంలో తీర్చిదిద్దిన తెప్పను పూలతో, విద్యుద్దీపాలతో అద్భుతంగా అలంకరించి, సాంప్రదాయ వస్త్రధారణలో ఉన్న పూజారులు వేదమంత్రాలు, మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని తెప్పపైకి ఎక్కించి, అనంతరం మూడు సార్లు చెరువులో విహరింపజేస్తారు.

Leave a Reply